స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ వాసులు మరణించారు. సిద్ధిపేట జిల్లా చౌటుపల్లికి చెందిన నలుగురు అన్నదమ్ములు కారులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న నలుగురూ మృతి చెందారు. మృతులను కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒకే కటుంబంలోని నలుగురు సోదరులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బ్రేకింగ్: ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు దుర్మరణం
0
370
Previous article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


