స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ వాసులు మరణించారు. సిద్ధిపేట జిల్లా చౌటుపల్లికి చెందిన నలుగురు అన్నదమ్ములు కారులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న నలుగురూ మృతి చెందారు. మృతులను కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒకే కటుంబంలోని నలుగురు సోదరులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.