వరంగల్ జిల్లా వర్థన్నపేట పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎంపీ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. పట్టణానికి చెందిన నవీన్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే అతనికి తీవ్ర జ్వరం రావడంతో భార్య మేఘన స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ శ్రీనివాస్ వద్దకు తీసుకెళ్లారు. వెంటవెంటనే ఇంజక్షన్లు ఇవ్వడంతో అతను అపస్మాకర స్థితిలోకి వెళ్లాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆర్ఎంపీని నిలదీయడంతో భయపడి స్థానిక ప్రైవేట్ తీసుకె ళ్లాడు. అక్కడ పరిస్థితి సీరియస్గా ఉందనడంతో వరంగల్ గార్డియన్ ఆసుపత్రికి తరలించి ఒకరోజు చికిత్స అందించారు. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్ యశోదకు తరలిం చారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడని మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


