35.8 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

ఆర్‌ఎంపీ నిర్లక్ష్యానికి బలైన నిండు ప్రాణం

  వరంగల్ జిల్లా వర్థన్నపేట పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్‌ఎంపీ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. పట్టణానికి చెందిన నవీన్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే అతనికి తీవ్ర జ్వరం రావడంతో భార్య మేఘన స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ శ్రీనివాస్‌ వద్దకు తీసుకెళ్లారు. వెంటవెంటనే ఇంజక్షన్లు ఇవ్వడంతో అతను అపస్మాకర స్థితిలోకి వెళ్లాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆర్ఎంపీని నిలదీయడంతో భయపడి స్థానిక ప్రైవేట్ తీసుకె ళ్లాడు. అక్కడ పరిస్థితి సీరియస్‌గా ఉందనడంతో వరంగల్ గార్డియన్ ఆసుపత్రికి తరలించి ఒకరోజు చికిత్స అందించారు. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్ యశోదకు తరలిం చారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడని మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్