స్వతంత్ర వెబ్ డెస్క్: చేదుకూరల నుంచి తీపి కూరల వరకు వాటిల్లో ఉన్న వెగటును, జిగటును తీసేసేది టమాట. మధ్య, పేద తరగతి కుటుంబాల్లో ఇంటిల్లిపాదికి సరిపోయేవిధంగా కూరలు వండాలంటే వాటిల్లో టమాటలు వేయాల్సిందే. గతేడాది ఇదే సమయంలో అక్కడెక్కడో పాకిస్థాన్‌లో వరదలు వచ్చిన ప్రాంతాల్లో కిలో టమాట రూ.500, కిలో ఉల్లిగడ్డ రూ.300 పలికిందంటే అది నిజం కాదనుకున్నాం. ప్రపంచ దేశాల నుంచి తిరస్కరణను ఎందుర్కొంటున్న పాక్ ఆయా దేశాల సానుభూతిని పొందడానికి అలాంటి వార్తను స్క్రోల్ చేసి ఉండవచ్చని అనుకున్నారు ప్రజలు. కానీ సరిగా ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలో వర్ష బీభత్సానికి అక్కడ కూరగాయలు దొరకక ధరలు విపరీతంగా పెరిగాయి.
ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ లాంటి రాష్ర్టాల్లో గంగోత్రి, యమునోత్రి, హరిద్వార్ లాంటి నగరాల్లో కిలో టమాట ధర రూ.300 అయింది. అలాగే ఢిల్లీ, ముంబై, కలకత్తా లాంటి మెట్రో నగరాల్లో మామూలుగా ఉండే ధర కంటే దాదాపు 600 నుంచి 800 శాతం వరకు పెరిగి కిలో టమాట రూ. 150 నుంచి రూ.200లకు చేరుకున్నది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని చర్యల వల్ల హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో టమాట ధరలు కొంత అదుపులో ఉండి కిలో టమాట రూ.100 పలుకుతున్నది. ఇసుక నేలల నుంచి బంకమట్టి నేలల వరకు అన్ని రకాల నేలలు టమాట సాగుకు అనుకూలమైనవి. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం…21 నుంచి 24 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలుండే ప్రాంతాల్లో టమాట రంగులో నాణ్యత, వృద్ధి బాగా వస్తుంది.
ఆయా దేశాల్లో ప్రతి వెయ్యి మందిలో ముగ్గురు క్యాన్సర్ బారిన పడితే మనదేశంలో మాత్రం ఒక్కరికే వ్యాధి సంక్రమిస్తున్నది. దానికి ప్రధా న కారణం మన వంటల్లో టమాట విరివిగా వాడటమేనని పరిశోధకులు చెప్తున్నారు.టమాట వినియోగం వల్లే మనదేశ ప్రజలపై క్యాన్సర్ ప్రభా వం లేదని అనేక ఆరోగ్య సర్వేల్లో వెల్లడైం ది. అందుకే కేంద్రం బలమిస్తే ప్రజ ల ఆయుష్షును పెంచే టమాటకు రైతు ఆయుష్షు పోస్తాడు.