ఇండియన్ వికెట్ కీపర్, యువ బ్యాటర్ అయిన రిషబ్ పంత్ ను ఇండియన్ క్రికెట్ నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. ప్రస్తుతం కారణాలేమిటనేవి ఎవరికీ తెలియలేదు. అయితే తను ఇటీవల తరచూ విఫలమవడమే అందుకు కారణమా? లేక ఏదైనా గాయమైందా? లేక వెళ్లిపోతానని తనే అడిగాడా? అనే దానిపై స్పష్టత లేదు.
రిషబ్ పంత్ కి అన్నిరకాల వైద్య సేవలు చేసిన తర్వాతే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే తను మళ్లీ టెస్ట్ మ్యాచ్ లకి అందుబాటులోకి వస్తాడని పేర్కొంది. దీనివల్ల అతనిపై క్రమశిక్షణా చర్యలు ఉండకపోవచ్చునని అంతా అనుకుంటున్నారు.
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రావిడ్ తో పంత్ సంప్రదించి, తనని వన్డే క్రికెట్ నుంచి తప్పించమని కోరినట్టు తెలిసింది. అయితే ఇలా అడగడానికి గల ప్రత్యేకమైన కారణాలైతే తెలియవు కానీ, ఇటీవల న్యూజిలాండ్ లో విఫలం కావడంతో తను సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేఎల్ రాహుల్ మాత్రం పంత్ విషయం నాకన్నా మెడికల్ టీమ్ కే బాగా తెలుసునని అన్నాడు.
సంజుశాంసన్ ఒక్కడిని పక్కన పెట్టి, రిషబ్ పంత్ కి ఎక్కువ అవకాశాలిస్తోందని బీసీసీఐపై కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర క్రికెటర్లపై కనికరం లేకుండా చూసే బీసీసీఐ ఒక్క పంత్ పై మాత్రం ప్రత్యేక ప్రేమ చూపించడంపై దుమారాలు రేగుతున్నాయి.