తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఇవాళ నాలుగు నియోజక వర్గాల్లో పర్యటించ నున్నారు. కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గా ల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జన జాతర సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్ కు సీఎం హాజరవుతారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి.