తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కాసేపటి క్రితం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. ఏఐసీసీ పెద్దలను కలవబోతున్నారు. పెండింగ్ పార్లమెంటుకు స్థానాల అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా చర్చించబోతున్నారు. పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలను కోరనున్నారు రేవంత్.


