TSPSC పేపర్ లీక్ కేసు దర్యాప్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పెద్దల పేర్లు బయటకు చెబితే ఎన్ కౌంటర్ చేస్తామని జైలులో నిందితులను బెదిరించారని రేవంత్ ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే జరిగిందన్నారు. కేటీఆర్ పిఏ తిరుపతిరెడ్డికి నిందితుడు రాజశేఖర్ రెడ్డి కి సంబంధం ఉందన్నారు. గ్రూప్-1 పేపర్ లీకేజీలో తిరుపతి కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. తిరుపతి చెప్పడంతోనే రాజశేఖర్ కు TSPSCలో ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం కాదు.. చంచల్ గూడా జైలులో పెట్టాలని మండిపడ్డారు. ఇక ఈ లీకేజీలో అధికారి శంకరలక్ష్మి పాత్ర ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు. గ్రూప్1 ప్రిలిమ్స్ లో వంద మార్కులు దాటిన వారందిరిని విచారించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.