స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆస్కార్ అవార్డు గెలిచిన తెలంగాణ బిడ్డ, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పట్ల కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ పేద కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ నాటునాటు పాట ద్వారా ఆస్కార్ గెలిచి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడన్నారు. అలాంటి సిప్లిగంజ్ ను ప్రభుత్వం సన్మానించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరపున జూన్ 2న రాహుల్ కు భారీ సన్మానం నిర్వహించి రూ.10లక్షల నగదు కూడా అందిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోటి రూపాయల నగదు బహుమతి అందిస్తామని చెప్పారు.


