రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదని మాజీమంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ ఉద్యమ ద్రోహి తప్ప ఉద్యమకారుడు కాదని మండిపడ్డారు. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడనీ, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుక అని కొనియాడారు. తెలంగాణను ఏపీలో కలపాల ని ఆంధ్ర నాయకులు అంటున్నారని మండిపడ్డారు. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కళను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.