స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 25, బీజేపీ 9, ఎంఐఎం 7 స్థానాలు గెలుచుకుంటాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 125 సీట్లు దక్కించుకుంటుందని చెప్పానని.. ఇప్పుడు అదే నిజమైందని తెలిపారు. తెలంగాణలో కూడా తాను చెప్పిందే జరుగుతుందన్నారు. కచ్చితంగా కాంగ్రెస్‌కు 80కిపైగా సీట్లు వస్తాయని చెప్పారు. తనకు సీఎం కావాలనే ఆసక్తి ఉన్నా.. బయటకు చెప్పలేను కదా.. పీసీసీ చీఫ్ హోదాలో అందరి అభిప్రాయాలను గౌరవించాలని వెల్లడించారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ మీద స్పష్టంగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు భారీ సభలకు ప్లాన్ చేశామన్నారు. సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు కర్ణాటక నేతలు కూడా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.