32.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

మోదీకి రేవంత్ సరెండ‌ర్…?

           ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోసిన రేవంత్ రెడ్డి..ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా మారారు..? విభ‌జ‌న హ‌మీలు, తెలంగాణ‌కు అన్యాయం అంటూ ఒంటికాలి మీద లేచిన రేవంత్‌లో ఇప్పుడా ఫైర్ ఎందుకు ఆరిపోయింది..? కూతురు కేసు వ‌ల్లే కేంద్రానికి కేసీఆర్ స‌రెండ‌ర్ అయ్యార‌ని విమర్శ‌లు చేసిన రేవంత్..ఇప్పుడు తానేందుకు నోరు మొద‌ప‌డం లేదు…? లెట్స్ వాచ్ దీస్ స్టోరీ.

       ఎన్నిక‌ల ముందు కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేశారు రేవంత్ రెడ్డి. సీఎం అయ్యాక త‌న వైఖ‌రి మార్చుకున్నారు. కేంద్రం ప‌ట్ల మెత‌క వైఖ‌రిని అవ‌లంభి స్తున్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ‌కు అన్యాయం చేస్తుంద‌ని..విభ‌జ‌న హ‌మీలు అమ‌లు చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌ల‌ను మానుకున్నారు. కూతురు క‌విత ఢిల్లీ లిక్క‌ర్ కేసులో చిక్కుకున్నందునే కేసీఆర్ కేంద్రానికి స‌రేండ‌ర్ అయ్యార‌ని..తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే విభ‌జ‌న హ‌మీల‌పై పోరాటం చేస్తామ‌న్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మాట మాత్రంగా కూడా కేంద్రాన్ని విమ‌ర్శించ‌డం లేదు.

      అక్క‌డ మోదీ…ఇక్క‌డ కేడీ తెలంగాణ‌కు న‌ష్టం చేస్తున్నార‌ని బ‌హిరంగ స‌భ‌ల్లో నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ప్ర‌ధానిని ప‌ల్లెత్తు మాట అన‌డం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేంద్రం అద‌నంగా తెలంగాణ‌కు ఇచ్చిందేమీ లేదు. అయినా కేంద్రానికి ఆగ్ర‌హం తెప్పించే ఏ ప‌ని రేవంత్ చేయ‌డం లేదు. పైగా తెలంగాణ‌ బీజేపీ ఎంపీల‌పై విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితమవుతున్నారు. ఇక్క‌డి న‌లుగురు ఎంపీలు నిధులు తేవ‌డం లేద‌ని నిందిస్తున్నారు త‌ప్పితే..కేంద్రం నిధులివ్వ‌డం లేద‌ని పొర‌పాటున కూడా ప‌ల‌క‌డం లేదు రేవంత్. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రేవంత్ రెడ్డి..కేంద్రంతో స‌ఖ్య‌త‌గా మెలిగేందుకే ప్ర‌య‌త్నిస్తున్నారు. స‌ఖ్య‌తగా ఉండి నిధులు తెచ్చుకుంటే ప‌ర్లేదు. కానీ, కేంద్రం తెలంగాణకు అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు చేకూర్చింది లేదు. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌లేమ‌ని మేహం మీదే చెప్పేసింది కేంద్రం. అయినా బీజేపీ వైఖ‌రిని త‌ప్పు బ‌డుతూ విమ‌ర్శ‌లు చేసింది లేదు.

         ఇక క‌నీసం గ‌వ‌ర్నర్ ప్ర‌సంగంలోనూ కేంద్రం తెలంగాణ‌కు చేస్తోన్న అన్యాయంపై ప్ర‌స్తావ‌న లేదు. బీఆర్ఎస్ హ‌యంలో కేంద్రం తెలంగాణ‌పై వివ‌క్ష చూపిస్తోంద‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ద్వారా త‌మ నిర‌స‌న‌ను కేంద్రానికి వ్య‌క్తం చేశారు వారు. కానీ రేవంత్ హ‌యాంలో అది మ‌చ్చుకు కూడా క‌నిపించడం లేదు. బ‌డ్జెట్ ప్ర‌సంగంలోనూ కేంద్రం నుంచి న్యాయ‌మైన వాట‌,పెండింగ్ నిధుల అంశాలు లేవు. కేంద్రం విష‌యంలో రేవంత్ స‌ర్కార్ వ్యూహాత్మ‌కంగా దాట‌వేత ధోర‌ణి అవ‌లంభించింది. కేంద్ర నుంచి రావాల్సిన నిధుల‌పై సైలెంట్ గానే ఉంది. అడ‌పాద‌డ‌పా కేంద్ర మంత్రుల‌కు విన‌తి ప‌త్రాలిస్తుందే త‌ప్ప హక్కుల కోసం కేంద్రాన్ని గ‌ట్టిగా నిల‌దీయం లేదు. ఇక ఈ ద‌ఫా కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు ఏలాంటి ప్రాధాన్య‌త లేదు. ప్ర‌త్యేకంగా నిధుల కేటాయింపులు లేవు. అయినా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర వైఖ‌రిపై త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌లేదు. గ‌తంలో బ‌డ్జెట్ తర్వాత అప్ప‌టి సీఎం కేసీఆర్..ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ కేంద్రం తీరును ఎండ‌గ‌ట్టే వారు. కానీ రేవంత్ మాత్రం కేంద్ర బ‌డ్జెట్‌పై త‌న అభిప్రాయాన్ని బ‌య‌ట‌పెట్ట‌ లేదు. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఢిల్లీలో క‌ర్ణాట‌క‌, కేర‌ళ సీఎంలు ధ‌ర్నా చేస్తే…తెలంగాణ స‌ర్కార్ మాత్రం మౌనాన్ని వీడ‌లేదు.

         మ‌రో వైపు ఎన్నిక‌ల వేళ అధిష్టాన పెద్ద‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం, మోదీ, అమిత్ షాలు టార్గెట్ చేసినా రేవంత్ ప‌ట్టింపు లేనట్టుగానే వ్య‌వ‌హ‌రించారు. అదే గ‌తంలోనైతే రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డి, గాంధీ భ‌వ‌న్‌లో దీక్ష‌లు, ప్రెస్ మీట్ల‌తో అద‌రగొట్టేవారు. కానీ రేవంత్ సీఎం అయ్యాకా పార్టీ పెద్ద‌ల‌కు అండంగా నిల‌వ‌డం లేదు. అసెంబ్లీలో పార్టీ పెద్ద‌ల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త‌లో కొంతైనా..సీఎంగా పార్టీ పెద్ద‌ల‌ను డిఫెండ్ చేయ‌డానికి వెచ్చిస్తే బాగుండేద‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. అయితే అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రేవంత్ రాజ‌కీయ‌మంతా టార్గెట్ కేసీఆర్ అన్న‌ట్టుగానే మారిందే త‌ప్ప కేంద్ర ప్ర‌భుత్వంపై క‌నీస విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు మోదీ స‌ర్కార్‌పై ఒంటికాలిపై లేచిన రేవంత్ ..ఇప్పు డెందుకు సైలెంట్ అయ్యారో అంతు చిక్క‌డం లేదు. కేంద్రంపై రేవంత్ మౌనం వ్యూహాత్మ‌కమా లేక కేసుల భ‌య‌మా అన్న చ‌ర్చ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఊపందుకుంది.

Latest Articles

షకీల్ కుమారుడు రాహిల్ కేసులో కీలక మలుపు

  మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రజా భవన్ వద్ద ప్రమాదానికి పాల్పడిన రాహిల్‌ కేసులో నిందితుడికి సహకరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్