కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం పునః ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం ప్రారంభించారు. అయితే గురువారంతో ఎలక్షన్ కోడ్ ముగియడంతో నేటి నుంచి ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. గతంలో వలే మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలి పారు. తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రభుత్వ దృష్టి తీసుకురవాచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రజా వాణిలో వచ్చిన వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వర పరిష్కారాలు చూపాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.