28.7 C
Hyderabad
Tuesday, April 14, 2026
spot_img

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్లు

షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ వీకెండ్స్ సరదాగా గడపాలని ప్రతి ఒక్కరూ అనుకోవడం సహజమే. రెస్టారెంట్లలో బిర్యానీలు, పార్లర్ లలో ఐస్ క్రీంలు తీసుకుంటూ వారాంతపు సెలవలకు వన్నె తేవాలని భావించడమూ సర్వ సహజమే. అయితే, గ్రేటర్ సిటీ లో చాలా రెస్టారెంట్లు కాలం చెల్లిన వస్తువులు, పాడైన పదార్ధాలను అంటగడుతు న్నాయి. దీంతో, కుటుంబ సభ్యులతో జాలిగా గడపాల్సిన హ్యాపీ హాలిడే, విచారంగా గడిపాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం దాడులతో హైదరాబాద్ హోటళ్ళు, రెస్టారెంట్ల అసలు నిజాలు బయటపడుతున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చాలా రెస్టారెంట్లు, హొటల్ మేనేజ్ మెంట్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి . దీంతో, ప్రభుత్వం ప్రత్యేక టాస్క ఫోర్స్ ఏర్పాటు చేసి..రెస్టారెంట్ల గుట్టు రట్టు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్భాటంగా ప్రకటనలు చేసుకుంటూ, గొప్పగా ప్రచారాలు సాగిస్తున్న ఎన్నో హొటళ్లు, రెస్టారెంట్లు.. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, గడువు తీరిన పదార్థాలతో వంటకాలు చేసి, వినియోగదారులకు అంటగడుతున్నాయి. దీంతో, ఫుడ్ సేఫ్టీ కమిషన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ టీం ఏ టైంలో ఏ ఏరియాలో ఎక్కడ ఏ రెస్టారెంట్ పై దాడి చేస్తుందో సమాచారం ఇవ్వదు. మూడో కంటికి తెలియకుండా ఆకస్మికంగా దాడులు చేస్తుంది. హైదరాబాద్ మాదాపూర్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ తోపాటు పలు ఏరియాల్లోని రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్, ఐస్ క్రీమ్ పార్లర్లపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం దాడులు సాగించింది.

గతంలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తరహా దాడులు నిర్వహించేవారు. అయితే, ఫుడ్ సేఫ్టీ అధికారులు, రెస్టారెంట్ యజమానులతో కుమ్మక్కయినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, అటు హోటల్ యాజమాన్యాలు పట్టించుకోలేదు. హోటల్స్, రెస్టారెంట్ల తీరులో ఏ మార్పు రాలేదు. కుళ్లిన పదార్ధాలు, రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, లేబుల్ లేని, కాలంచెల్లిన వస్తువులను రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు వినియోగిస్తు న్నారు. దీంతో, సర్కారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అతి రహస్యంగా దాడులు సాగిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

హైదరాబాదులోని మాదాపూర్ రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్, బంజారాహిల్స్ లెబో నెల్, మనం చాక్లెట్ కార్ఖానా, బాస్ కింగ్ రాబిన్స్, ఉప్పల్ ఏరియాలోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్, సోమాజిగూడలో కేఎఫ్సీ, రెస్ట్ ఒబార్, కృతుంగా రెస్టారెంట్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అదేవిధంగా లకిడికపూల్ లోని రాయలసీమ రుచులు, షాగౌస్, ఖైరతాబాద్ లోని కామత్ హోటల్, సుక్సాగర్ హోటల్, అమీర్ పేట రత్నదీప్ రిటైల్ స్టోర్, జూబ్లీహిల్స్ డౌన్ టౌన్ పబ్ లో మక్కువ కిచెన్ అండ్ బార్, నాచురల్స్ ఐస్ క్రీమ్ లో దాడులు నిర్వహించారు. అదేవిధంగా హిమాయత్ నగర్ లోని క్లో వెజిటేరియన్ ఫైన్డైన్, క్రీమ్ స్టోన్ అవుట్ లైట్, మోహింజాయి మార్కెట్లోని బిలాల్ ఐస్ క్రీమ్ ఇలా హైదరాబాద్ నలుమూలల స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం జల్లెడ పడుతోంది. నగరంలోని పేరుందిన పలు రెస్టారెంట్లు, రిటైల్ స్టోర్లు, బార్లు ఐస్ క్రీమ్ పార్లర్లు, కరాచీ బేకరీలు ఇలా పలు చోట్ల కాలం చెల్లిన వస్తువులు, నాణ్యత లేని పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నట్టు సమాచారం. దీనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శ లు వస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని కలుషితమయం చేస్తున్న ఈ తరహా రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యా లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడులను కొనసాగించా లని మరిన్ని వాటి మీద దాడులు చేయాలని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పేర్లతో సహా వివరాలు తెలియజేస్తున్నారు.

స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం వరుస దాడులు సాగిస్తూ రెస్టారెంట్లు, హోటళ్ల బాగోతాలను వెల్లడిస్తున్నాయి. చాలా రెస్టారెంట్ లు, బార్లు, ఐస్ క్రీం పార్లర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, నాసి రకం పదార్థాలు వినియోగిస్తున్నారని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే, దాడులు, ప్రకటనలు తప్ప నిందిత యాజమాన్యాలపై చర్యలేమీ తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం చెందుతు న్నారు. ఇప్పటికైనా సర్కారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని రాంగ్ వేలో వెళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, ఆ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్