బీఆర్ఎస్ అధ్యకుడు కేసీఆర్ చేరబోయేది బీజేపీలో అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్.. బీజేపీలో చేరతారని తాము మొదటి నుంచి చెబుతున్నామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతి చ్చిందన్నారు రేవంత్ రెడ్డి. నామానాగేశ్వర్ రావుని బకరాని చేయడానికి వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమని కేసీఆర్ చెబుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారని కేసీఆర్‌ను అడుగుతున్నానని ప్రశ్నించారాయన. రైతు భరోసా, రైతు రుణమాఫీపై బీఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. ఈనెల 9 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా బకాయిలు చెల్లిస్తామని చెప్పారాయన. ప్రతి రైతుకు రైతు భరోసా వేస్తే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. భద్రాచలం రాములవారి సాక్షిగా పంద్రాగష్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరతామని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారని చెబుతుంటే అది అబద్ధమని అంటున్నారు. కానీ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ ఒక సభ వేదికగా మాట్లాడిన మాటలు గమనించాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రిజర్వేషన్లు కొనసాగుతాయని రేవంత్ స్పష్టం చేశారు.


