తెలంగాణ కాంగ్రెస్ మహిళా ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి(Renuka Chowdhury) హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రలో తాను ఎక్కడైనా తిరుగుతానని.. ఎవరు ఆపుతారో చూస్తానని ఆమె హెచ్చరించారు. ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని విమర్శించారు. కులాల పేరుతో విమర్శలు చేస్తున్నారని.. వైసీపీ(YCP) నేతల భాషను ప్రజలు అసహ్యించికుంటున్నారని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా ఏపీ ప్రజలు తీవ్ర నరకం అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని.. అధిష్టానం ఆదేశిస్తే ఏపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రజలు బుద్ధి చెప్పాలని రేణుక(Renuka Chowdhury)డిమాండ్ చేశారు.
Read Also: ముసలోడిని అవుతున్నా.. కేసీఆర్ ఛలోక్తులు
Follow us on: Youtube