Covid cases in India | దేశంలో కరోనా మహమ్మారి శాంతించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా దేశ వ్యాప్తంగా 5,537 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మృత్యువాత పడ్డారు. గుజరాత్లో ఇద్దరు చనిపోగా… ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్లో ఒక్కొక్కరు మృతి చెందారు. దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,30,965కు చేరగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు చేరింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,47,56,616 మందికి కరోనా సోకింది. రికవరీ రేట్ 98.74 శాతంగా ఉంది. ఇక కరోనా టీకాల విషయానికొస్తే.. ఇప్పటివరకు 220.66 (220,66,22,663) కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏదేమైనా ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు ఎక్కువగా గుమిగూడ ఉన్నచోట మాస్క్ తప్పనిసరిగా వాడాలని హెచ్చరించారు.