పదేళ్లకాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. ప్రజల జీవితాల్లో , దేశంలో అర్థవంత మైన మార్పులు తీసుకురావడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. 2014లో అనూహ్యమై న విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకవైపు నరేంద్ర మోడీ జనాకర్షణ, మరోవైపు అమిత్ షా చాణక్యంతో దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిం ది. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించడానికి కమలనాథులు తీవ్రంగా శ్రమించారు. నరేంద్ర మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసింది. రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. దీంతో కాశ్మీర్ లోయలో తుపాకుల పేలుళ్లకు తెరపడింది. కాశ్మీర్‌కు మళ్లీ పర్యాటకులు రావడం మొదలైంది.
పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి కొన్ని నెలల కిందట నరేంద్ర మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో హింసకు గురైన ముస్లిమేతర మైనారిటీలకు భారతీయ పౌరసత్వం మంజూరు చేయడానికి అనుమతించడానికి వీలు కల్పించిందే పౌరసత్వ సవరణ చట్టం. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తు సేవల పన్ను విధానాన్ని అమలు చేసింది. ఇది స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో వచ్చిన అత్యంత ముఖ్యమైన పన్ను సవరణ. ఈ నిర్ణయంతో కేంద్రం, రాష్ట్ర పన్నులు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వ్యాపారులను పన్ను పరిధిలోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. జీఎస్టీ అమలులోకి రావడంతో ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది. అంతేకాదు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో జాతీయ రహదారుల విస్తరణ వేగవంతమైంది. రహదారి పొడవును లెక్కించే పద్ధతిలో మార్పు వచ్చింది. మార్చి 2022లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చేసిన ప్రకటన ప్రకారం గత ఎనిమిదేళ్లకాలంలో 49,903 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించింది.
అగ్రకులాలలోనూ ఆర్థికంగా ఇబ్బందులు పడే వారు ఎంతో మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగరంగాల్లో ఆర్థికంగా బలహీనవర్గాలకు మేలు చేయడానికి ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ. ఈడబ్ల్యూఎస్ కోటా అర్హత పొందడానికి, ఒక వ్యక్తి, కుటుంబం ఆదాయం సంవత్సరానికి రూ. 8 లక్షలు మించకూడదు. మొత్తంమీద ఈడబ్ల్యూఎస్ కోటా అగ్రకులాల్లోని పేదలు ఎంతోమంది లాభపడ్డారు. కాగా దేశంలో పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించేందుకు 2014లో గాంధీ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోడీ. ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ను ప్రారంభిం చారు. ఈ మిషన్‌లో భాగంగా ఐదేళ్లలో 100 మిలియన్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా బహిరంగ మల విసర్జన రహిత గ్రామీణ భారతదేశాన్ని సాధించడం జరిగింది. 11.5 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించా మని ప్రభుత్వం చెబుతోంది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి 2020లో కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుం ది. బ్యాంకుల విలీనాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బ్యాంకుల విలీనాల నిర్ణయం టోటల్‌గా బ్యాంకింగ్ రంగానికి ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది. విలీనం తరువాత బ్యంక్ కస్టమర్లకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు లభించాయి. అంతేకాదు మనదేశంలో బ్యాంకుల సామర్థ్యం కూడా పెరిగింది.
ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళల కన్నీళ్లు తుడిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే బిల్లు 2019 జూలైలో పార్లమెంటులో ఆమోదం పొందింది. ఈ చట్టంతో మూడుసార్లు తలాక్ అనే పదాన్ని పలికి తక్షణ విడాకులు తీసుకునే ముస్లిం పురుషులకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.అయోధ్య రామమందిర అంశంతో ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా మరింతగా పెరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే డిమాండ్ ఇప్పటిది కాదు. దాదాపు ఐదు వందల ఏళ్ల నుంచి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆయనకు అత్యంత సుందరంగా ఒక మందిరం నిర్మించాలన్నది భారతీయుల కల. చాలా కాలం పాటు ఆ కల కలగానే మిగిలింది. చివరకు నరేంద్ర మోడీ హయాంలో శతాబ్దాల కల సాకారమైంది.


