స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించారు. దీంతో రాజస్థాన్‌పై 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రన్ రేట్ మెరుగుపర్చుకుంది. అటు ఘోర ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 59 పరుగులకే ఆలౌటైంది. రాయల్స్ బ్యాటర్లలో హెట్మెయర్(35) తప్ప ఒక్కరూ కూడా రెండెంకెల స్కోరు చేయలేదు. ఆర్సీబీ బౌలర్లలో పార్నెల్ మూడు వికెట్లతో అదరగొట్టాడు. ఇక సిరాజ్, కర్ణ్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 171/5 పరుగులు చేసింది. కెప్టెన్ డూప్లిసెస్(55), మ్యాక్స్ వెల్(54) పరుగులతో రాణించగా.. చివర్లో అనూజ్ రావత్(29) వీరవిహారం చేశాడు. రాయల్స్ బౌలర్లలో అడం జంపా, ఆసిఫ్ తలో రెండు వికెట్లు తీశారు.