స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రూ.2000 నోట్లను బ్యాన్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఇకపై వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ తీసుకున్న ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. రూ.2వేల నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అయితే డిపాజిట్ విషయంలో ఎలాంటి నిబంధనలు విధించలేకపోవం గమనార్హం.


