రూ.2000నోట్ల రద్దుపై స్పష్టత ఇచ్చిన RBI

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రెండు వేల రూపాయల నోట్ల రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పష్టత ఇచ్చింది. రూ.2000నోట్లు రద్దు చేయలేదని ఉపసంహరణ మాత్రమే చేశామని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెల చివరి వరకూ బ్యాంకుల్లో మార్చుకోవచ్చని సూచనలు చేసింది. ఒకవేళ ఆ తర్వాత మార్చుకోకపోయినా రోజువారీ లావాదేవీలు జరుపుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. అయితే గడువులోగా మార్చుకుంటే మంచిదని సూచించింది. సెప్టెంబర్ 30 తర్వాత కూడా బ్యాంకుల్లో రూ.2000 నోట్లను ఖాతాల్లో జమచేసుకోవచ్చు.. కానీ ఇతర నోట్లలోకి మార్పిడి చేసుకోడానికి మాత్రం అవకాశం ఉండదని స్పష్టంచేసింది. ఈ మేరకు RBI ఓ నోట్‌ను విడుదల చేసింది.

మే 23 నుంచి ఒకేసారి రూ.20,000 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. ఖాతా ఉన్న బ్యాంకులోనే కాకుండా ఏ బ్యాంక్ బ్రాంచ్‌లోనైనా బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా కూడా గరిష్టంగా రోజుకు రూ.4వేల వరకు ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయదల్చుకుంటే ఎలాంటి పరిమితులూ ఉండవు. ఎంత మొత్తంలోనైనా రూ.2000 నోట్లను జమ చేయడంతో పాటు డ్రా కూడా చేసుకోవచ్చు.

సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోసం బ్యాంకు అధికారులే ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటుచేస్తారు. నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్‌ చేసుకోడానికి బ్యాంకులు నిరాకరించకుండా ఇప్పటికే ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏవైనా సమస్యలుంటే రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఫిర్యాదు కూడా చేయవచ్చు.

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్