స్వతంత్ర వెబ్ డెస్క్: వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి దేశం నుంచి పారిపోయి సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ దీవిని తాను ఏలుతునట్లు ప్రకటించుకున్నాడు. దానికి కైలాస (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస) దేశంగా పేరు పెట్టుకున్నాడు. ఆ దేశానికి ప్రత్యేక కరెన్సీ, పాలన విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచాడు. తన ప్రియ శిష్యురాలు, సినీ నటి రంజితను కైలాస దేశానికి ప్రధానిగా ప్రకటించాడు. తాజాగా ఆయన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ఆ దేశానికి ప్రధానిని చేశారు. దానికి సంబంధించిన ప్రకటన గురించి ఓ తమిళ పత్రిక కథనాన్ని విడుదల చేసింది. దీంతో మరోసారి నిత్యానంద స్వామి వార్తల్లో నిలిచాడు. నిత్యానంద వెబ్‌సైట్‌లోను కైలాస ప్రధాని గురించి ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. వెబ్‌సైట్‌లో ఫోటో కింద నిత్యనంద స్వామి అని పేరు ఉంది. ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా కైలాస దేశం తరఫున మహిళ రాయబారులతో కలిసి హాజరయ్యారాయన. ఈ నేపథ్యంలోనే నటి రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరయ్యే అవకాశముందని సమాచారం. కాగా రంజిత ప్రధాని అవనుందనే వార్త వైరల్ అవడంతో నెటిజన్లు ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. రంజిత పలు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె కెరీర్ గొప్పగా ఉన్న సమయంలోనే నిత్యానంద వద్దకు చేరింది. నిత్యానందకు, రంజితకు మధ్య శారీరక సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా గతంలో పెద్ద ఎత్తున జరిగింది.