Rangamarthanda OTT |ఇటీవల కాలంలో ఎలాంటి పబ్లిసిటీ లేకుండా విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ‘రంగమార్తాండ. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత ‘రంగమార్తాండ'(Rangamarthanda) అనే మూవీకి దర్శకత్వం వహించాడు. మరాఠీ మూవీ నటసామ్రాట్ చిత్రానికి రిమేక్ గా దీనిని తెరకెక్కించాడు. మరాఠీ మూవీ అయినా మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మన తల్లిదండ్రుల కథ అంటూ ప్రేక్షకులను ఏడ్పించేశాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలైనా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ తమ నటనతో అభిమానులను కట్టిపేడేశారు. ఇంతలా ప్రేక్షకుల మనసు గెల్చుకున్న ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫాంలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ యాప్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: హైదరాబాద్ టీంలోకి బాస్ దిగాడు.. ఈసారైనా బోణీ కొట్టేనా?
Follow us on: Youtube, Instagram, Google News