రాజమండ్రి విమానాశ్రయం ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు. కేంద్రం తరపున దావోస్ పర్యటనలో ఉన్నారు రామ్మోహన్ నాయుడు. అక్కడి నుంచే… అధికారులతో మాట్లాడారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ, పౌర విమానయాన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ వద్ద ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టెర్మినల్ కొంత భాగం కూలిపోయింది. అయితే ఆ సమయంలో కార్మికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనానికి ఆనుకుని నూతన టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడే ప్రమాదం జరిగింది. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు.