- స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపిన రామక్రిష్ణారెడ్డి
అమరావతి: స్వతంత్ర న్యూస్ ఛానెల్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వతంత్ర న్యూస్ ఛానెల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. నిజాలను నిర్భయంగా చెబుతూ.. ప్రజలకు దగ్గర కావాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు స్వతంత్ర న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సజ్జల రామక్రిష్ణారెడ్డి.
అలాగే, స్వతంత్ర న్యూస్ ఛానెల్ నూతన సంవత్సర క్యాలెండరును వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు సజ్జల భార్గవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భార్గవ్ మాట్లాడుతూ.. స్వతంత్ర న్యూస్ ఛానల్ సామాన్య ప్రజల గొంతుకగా ఉండాలని ఆకాక్షించారు.