ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీని ఈరోజు నిర్వహించనుంది. సేవ్ డెమోక్రసీ పేరుతో మెగా ర్యాలీ చేపడుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా సేవ్ డెమోక్రసీ ర్యాలీ చేయనుంది ఇండియా కూటమి. ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ప్రజాస్వా మ్యాన్ని, దేశాన్ని కాపాడటం కోసమే ర్యాలీ అంటున్నారు ఇండియా కూటమి నేతలు. ఈ ర్యాలీ లో కూటమిలోని 28 పార్టీలు పాల్గొననున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలపై ర్యాలీ చేయనున్నారు.