ఆ జిల్లాల్లో ఆ మంత్రి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. విజయం కోసం వ్యూహత్మకంగా ఎత్తులు వేస్తు న్నారు. తన గెలుపు గమ్యం చేరేందుకు అడ్డుగా ఉన్న నేతలకు చెక్ పెట్టేస్తున్నారు. పార్టీ అగ్రనేతల అండ దండలతో నియోజక వర్గం లో కార్పొరేట్ రాజకీయాలు చేస్తున్న ఆ మంత్రి ఎవరు?
ఘాటైన రాజకీయాలకు అడ్డా.. గుంటూరు జిల్లా. ఆ జిల్లాలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. రాజకీ యాల్లో సైబర్ టవర్స్ లో పెరిగిన మొక్క అంటూ టిడిపిపై సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపిన విడుదల రజినీ అనతికాలంలో టిడిపి నుంచి వైసీపీ కండువా కప్పుకున్న కొద్ది కాలంలోనే మంత్రి పదవి దక్కించుకున్నారు. గతంలో విడుదల రజినీ చిలకలూరిపేట సీటు గెలవడానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఎంతో సహకారం అందించారని చెప్పారు. తనను గెలిపించుకునే బాధ్యత సీఎం జగన్ మోహన్ రెడ్డి మర్రి రాజశేఖర్ కి అప్పగించారన్నారు. క్రమంగా ఉభయుల కూ చెడింది. నియోజక వర్గంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో మంత్రి విడుదల రజినీ, మర్రి రాజశేఖర్ మధ్య దూరం పెరిగింది. విభేదాలు తలెత్తాయి. ఒక వర్గం మరొకరు వర్గం విమర్శలు చేసుకున్న సందర్బాలు ఎన్నో…వైసీపీలో ఉన్నా ఇద్దరు దారులు వేర్వేరు. ఈ నేపథ్యంలో మల్లెల రాజేష్ నాయుడు మంత్రి విడుదల రజినీకి అత్యంత అప్తుడుగా మారారు.
చిలకలూరిపేట లో విజయం సాధించిన రజినీ మంత్రి పదవి రావడంతో మకాం గుంటూరుకి మార్చింది. దీంతో అక్కడ వైసీపీ పార్టీ బాధ్యతలను మల్లెల రాజేష్ నాయుడుకి అప్పగించినట్లు తెలుస్తోంది. మంత్రి రజినీ గుంటూరు వెస్ట్ వైసీపీ ఇన్చార్జి గా నియమితులైన తర్వాత చిలకలూరిపేట ఇన్ చార్జిగా మల్లెల రాజేష్ నాయుడు ను నియమించేటట్లు రాజకీయంగా పావులు కదిపినట్లు తెలుస్తుంది. మరో ఏడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా గుంటూరు టికెట్ ఆశించిన మేయర్ కావటి మనోహర్ నాయుడుని చిలకలూరి పేటకి ఇన్చార్జిగా వైసీపీ అధిష్టానం నియమిం చింది. దాంతో మల్లెల రాజేష్ నాయుడు మంత్రి విడుదల రజినీపై విమర్శలు చేశారు. మంత్రి రజినీ తననుంచి 6.5 కోట్ల రూపాయలు తీసుకొని పార్టీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిందని నాకు 3 కోట్లు మాత్రమే వెనక్కి ఇచ్చారని ఆందోళన చేపట్టారు.
రోడ్డుపై నిరసనలు చేశారు.
గుంటూరు కావటి మనోహర్ ని చిలక లూరి పేట లో ఇన్చార్జి గా నియమించడం వెనుక మంత్రిహస్తం ఉందనే ప్రచారం ఉంది. గతంలో వైసీపీ తరపున కావటి మనోహర్ వెస్ట్ టికెట్ ఆశించారు. తనకు అడ్డుగా వస్తారనే ఆలోచనతో రజినీ వ్యహత్మకంగా కావటి మనోహర్ ను చిలకలూరి పేటకు మార్చేందుకు కృషి చేశారనే ప్రచారం ఉంది. ఎంతో కాలంగా గుంటూరు లో ఎమ్మెల్సీ అప్పి రెడ్డి పెత్తనం కొనసాగుతూ ఉండేది. మంత్రి రజినీ గుంటూరుకి మకాం మార్చిన తర్వాత అప్పిరెడ్డి మద్దతు తో పోస్టింగ్ లోకి వచ్చిన పోలీస్ అధికారులను సైతం మంత్రి విడుదల రజినీ తనవైపు తిప్పుకుంది. తన నియోజక వర్గంలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు తో సమావేశం నిర్వహించి వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చి నట్లు తెలుస్తోంది. అంతేకాక ఎమ్మెల్సీ గా యేసు రత్నంతో కూడా టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తోందని కింది స్థాయి నేతలు గుస గుసలు లాడుకుంటున్నారు.
గుంటూరు లో విడదల రజని విజయం కోసం చిలక లూరిపేటలో ఉన్న వైసీపీ నాయకుల ఓట్లు సైతం శ్యామ లా నగర్ కి మార్చి వేసినట్లు తెలుస్తోంది. టిడిపి నాయకులు దీనిపై నిరసన తెలిపారు. తన గెలుపు కోసం ఇక్కడకి ఓట్లు మార్చి వేస్తే చిలకలూరి పేటలో వైసీపీ విజయం ఎలా వరిస్తుందని కొంత మంది వైసీపీ అగ్ర నేతలు మండి పడుతున్నారు. పార్టీ ఇలా సొంత నిర్ణయాలు తీసుకుంటే గుంటూరు పశ్చిమ నియోజక వర్గంలో పార్టీ ఇబ్బందులు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు కార్యకర్తలు. గుంటూరు పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే మద్దాల గిరి కూడా మంత్రి విడుదల రజినీ బాటలో నడుస్తున్నారు. రజినీని గెలిపిస్తే ఆయనకు బాధ్యత యుతమైన పదవి ఇస్తానని హామీ ఇచ్చి నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి విడుదల రజినీ సొంత నిర్ణయాలపై వైసీపీ నేతలు గుర్రు మంటు న్నారు. వైసీపీ అగ్రనేతల అండ దండలతో దూకుడుగా వ్యవహరిస్తున్న… రజినీ ఈ రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్ట కుంటే భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించు కోవాల్సివస్తుంది. కిందిస్థాయి నేతలను కలుపుకొని పోకుంటే మాత్రం కాలమే తగిన గుణపాఠం చెబు తుందని అంటున్నారు.