లావణ్య ఇష్యూతో వార్తల్లో నిలిచిన రాజ్‌తరుణ్.. భలే ఉన్నాడులే చిత్రంతో సెప్టెంబర్ 7న తెరపై ప్రేక్షకులను అలరించనున్నాడు. అయితే,.. ఈ మూవీకి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన రాజ్ తరుణ్.. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. సినిమాల కోసం కావాలనే లావణ్య ఇష్యూని బయటకు తీసుకు వచ్చి ఇద్దరూ కలిసి ప్రమోషన్స్ చేశారా అని ప్రశ్నకు షాక్ అయిన రాజ్.. మీ ప్రశ్నను జీర్ణించుకోవడానికే టైం పట్టింది.. అలా ఎవరైనా ప్రమోషన్స్ చేస్తారా? అని తిరిగి క్వశ్చన్ వేశాడు. మళ్లీ తనను కాంట్రవర్సీలోకి లాగొద్దని కోరాడు. తన గత రెండు చిత్రాలకు సరిగ్గా ప్రమోట్ చేయలేదనే రిగ్రెట్‌లో ఉన్నట్టు తెలిపాడు.