India Weather Alert | వారం రోజులుగా ఎండలు, వడగాల్పులకు విలవిలలాడుతున్న ప్రజలకు శుభవార్త తెలిపింది భారత వాతావరణ కేంద్రం. నేటి నుంచి 5 రోజుల పాటు ఎండ నుంచి ఉపశమనం కలుగనుందని వాతవరణ శాఖ తెలిపింది. తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ప్రభావం ఉంటుందని తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా వర్షాలు కురుస్తాయాని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, బీహార్ తదితర రాష్ట్రాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని వెల్లడించింది. వర్షాల ధాటికి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.