స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రోజంతా జోరు ఎండలు కొట్టడంతో ప్రజలంతా బెంభేలెత్తిపోయారు. మధ్యాహ్నం అయ్యే సమయానికి వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అలా అరగంట పాటు చల్లబడినతర్వాత.. కుండపోత వర్షం ప్రారంభమయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం ఒక్కసారిగా పడింది. నగరంలోని ఫిలింనగర్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, మాసాబ్ ట్యాంక్, బేగం పేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది.