Rain Effect | తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాబోయే 3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నేడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నారాయణపేట్, నాగర్ కర్నూల్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. అమీర్ పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ లో వర్షం పడుతోంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.