స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండడంతో రాష్ట్రంలో మరికొన్నిరోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కర పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడుతాయని సూచిందింది. ముఖ్యంగా చిత్తూరు, వైఎస్సార్ కడప, అల్లూరి, పల్నాడు, ఏలూరు, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. వర్షాల దాటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.


