స్వతంత్ర, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ను భూస్థాపితం చేసేందుకే రాహుల్ ఉన్నారని బీజేపీ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ ఉండదంటూ.. రాహూల్ గాంధీ మాట్లాడటం ఆయన అవివేకని బయట పడిందని అన్నారు. బీజేపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరిగిన పార్లమెంట్, ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మెరుగైన ఫలితాలు బీజేపికి వచ్చాయన్నారు. రాహుల్ గాంధీ మీటింగ్ లో జాతీయ గీతాన్ని అవమాన పరిచారన్న నల్లు.. పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా లేని పార్టీ.. అంతరించిన పోతున్న పార్టీ బీజేపి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అన్నారు. చాలా రాష్ట్రాల్లో ఒక్క సీట్ కూడా రీ ప్రజెంట్ లేని పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.