కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ కేరళలో వాయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక్కడి నుంచే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించబోతున్నారు. రాహుల్ రోడ్ షోను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తోంది. కేరళ నుంచి రాహుల్ అభ్యర్థి త్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని, కేరళలోని మిగిలిన 19 స్థానాల్లో యూడీఎఫ్ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
2019లో కేరళలోని 20 స్థానాలకు గాను యూడీఎఫ్ 19 స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల కోసం బీజేపీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రను రంగంలోకి దింపి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. 2019లో వాయనాడ్‌లో రాహుల్ గాంధీ 4.3 లక్షల కంటే ఎక్కవ ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. వామపక్షాలు సీపీఐ జాతీయ నాయకుడు అన్ని రాజాను రంగంలోకి దించడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది