31.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

ధృతరాష్ట్ర కౌగిలిలో పాకిస్తాన్

      చైనాది ధృతరాష్ట్ర కౌగిలని శ్రీలంక విషయం స్పష్టం చేసింది. తాజాగా మరోసారి పాకిస్తాన్ కూడా ఇదే విషయాన్ని చెబు తోంది. డ్రాగన్ చైనాను ఎక్కువగా నమ్మినదానికి పాకిస్తాన్ ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటోంది. పాకిస్తాన్ దారుణ పరిస్థితుల్లో ఉంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తాజాగా పాకిస్తాన్‌లో పెట్రోల్ ధరలు కొండెక్కాయి. లీటరుకు పది రూపాయలు పెంచింది పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్‌లో ప్రధాని పెషబాజ్ షరీఫ్‌ నాయకత్వంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పాకిస్తాన్ ప్రజలకు పెషబాజ్ షరీఫ్ ఇచ్చిన తొలి కానుక పెట్రోల్ ధరలు పెంచడమే. అయితే పెట్రోల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు పాకిస్తాన్ ఆర్థిక వేత్తలు. ఇదిలా ఉంటే తదుపరి రుణాలు కావాలంటే ప్రజలపై పన్నుల భారం వేయాల్సిందేనని షరతు పెట్టింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ.

   పాకిస్తాన్ కు 2022లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ద్రవ్యోల్బణం సెగ పాకిస్తాన్ ను కూడా తాకింది. పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంతగా 42 శాతం దాకా పెరిగింది. దీనికి తోడు 2022 జూన్ లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి.భారీ వరదలకు దేశంలో మూడో వంతు భాగం మునిగిపోయింది. వరదల కారణంగా పాకిస్తాన్ కు దాదాపు మూడు వేల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. ఈ నేపథ్యంలో ఎగుమతులు తగ్గాయి. ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఎగుమతులు అటకెక్కడంతో విదేశీ మారక నిల్వలు తగ్గాయి. అలాగే పాకిస్తాన్ రూపాయి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్ లో దారుణంగా పడిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి,సౌదీ అరేబియా చుట్టూ పాకిస్తాన్ పరుగెడుతోంది. సౌదీ అరేబియా ఇప్పటికే ఎనిమిది బిలియన్ డాలర్ల సాయం చేసింది. అయినా పాకిస్తాన్ అవసరాలకు సదరు సొమ్ము సరిపోని పరిస్థితి.ఐఎంఎఫ్ విడతలవారీగా భారీ ఎత్తున రుణం మంజూరు చేయడానికి అంగీకరించింది. అయితే అందుకు బోలెడన్ని షరతులు విధిస్తోంది. రుణం కావాలంటే పన్నులు పెంచాలని షరతులు విధిస్తోంది.

     కొన్ని నెలల కిందట పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేశారు. వాస్తవానికి ప్రధానిగా నాలుగోసారి పగ్గాలు చేపట్టాలని పాకిస్థాన్ ముస్లింలీగ్‌ – నవాజ్ తరఫున ఆ పార్టీ అధినేత నవాజ్‌ షరీఫ్ కలలు కన్నారు. అయితే నవాజ్‌ షరీఫ్ కలలను పాకిస్థాన్ సైన్యం వమ్ము చేసింది. దీంతో సైన్యం ఒత్తిడిమేరకు ప్రధాని పదవి రేసు నుంచి నవాజ్‌ షరీఫ్ తప్పుకున్నారు. సోదరుడు షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని పగ్గాలు అందచేశారు. కుమార్తె మరియం రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే సైన్యం ఆదేశాలను నవాజ్‌ షరీఫ్ పాటించారన్నది పాకిస్తాన్‌లో ఓపెన్ సీక్రెట్‌. కొన్నినెలల కిందట జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో ఏ పార్టీ కూడా స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా నవాజ్‌ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ అలాగే బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఒక ఒప్పందానికి వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనకు జై కొట్టాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో షెహబాజ్ షరీఫ్ నాయకత్వాలన కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజాస్వామ్యం గురించి ఎవరెన్ని కబుర్లు చెప్పినా పాకిస్తాన్‌ రాజకీయాల్లో మొదట్నుంచీ సైన్యానిదే కీలక పాత్ర. పాకిస్తాన్‌ రాజకీయాలను దగ్గరనుంచి పరిశీలించినవారికి ఇది కొత్త విషయం కాదు.

      పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయింది. ఈ 75 ఏళ్ల కాలంలో ఏ ఒక్క ప్రధాని పూర్తి కాలం పదవిలో లేకపోవడం ఓ విశేషం. ప్రభుత్వ వ్యవహారాల్లో మిలటరీ మితిమీరిన జోక్యమే దీనికి కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకేసారి స్వాతంత్య్రం పొందిన భారత్ వడివడిగా అభివృద్ది వైపు అడుగులు వేస్తే పాకిస్తాన్‌ మాత్రం నిత్యం సంక్షోభాల్లోనే కాలం వెళ్లదీసింది. పాకిస్తాన్‌ లోని వ్యవస్థలన్నీ అవినీతిలో కూరుకుపోయి నిస్తేజంగా మారాయి. ఈ అవకాశాన్ని మిలటరీ చాలా తెలివిగా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. సర్కారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలెట్టింది. జీ హుజూర్ అనే ప్రభుత్వాలకు సైన్యం మద్దతు దొరికేది. ఏమాత్రం స్వతంత్రంగా వ్యవహరించడానికి ఏ ప్రభుత్వాధినేత ప్రయత్నించినా సైన్యం చకచకా పావులు కదిపేది. అధికారంలో ఉన్న సర్కార్ ను కూల్చి వేసేంతవరకు సైన్యం నిద్ర పోయేది కాదు. ఇన్నేళ్ల పాకిస్తాన్‌ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ప్రజల కనీస అవసరాలను పట్టించుకున్న పాపాన పోలేదు. విద్య, వైద్య రంగాలతో పాటు మౌలిక వసతులను పాకిస్థాన్‌ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. బడ్జెట్‌లో రక్షణ రంగానికి అవసరానికి మించిన ప్రాధాన్యం ఇవ్వడం మొదలెట్టాయి. భారత్ పట్ల అనవసరపు వ్యతిరేకతతో ఖజానాలోని డబ్బును అధునాతన ఆయుధాలు కొనుక్కోవడానికే పాకిస్తాన్‌ ప్రభుత్వాలు ప్రయత్నించాయి. పాకిస్తాన్‌ అప్పుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రపంచపటంపై అప్పుల అప్పారావుగా పాకిస్తాన్‌ పేరు తెచ్చుకుంది. దీంతో అన్నిటికీ చైనా మీద ఆధారపడటం మొదలెట్టింది. ఇదే చివరకు పాకిస్తాన్‌ కొంపముంచింది. ఈ సంగతి ఎలాగున్నా…భారత్ పట్ల అపోహతో, అనవసరపు వ్యతిరేకతతో డ్రాగన్ చైనాకు ఇమ్రాన్ ఖాన్ హయాంలో పాకిస్తాన్ దగ్గరైంది. ఆసియా వ్యవహారాల్లో చైనాకు పాకిస్తాన్ మద్దతు పలికింది. తెలివి తక్కువగా చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ కుదేలైంది. ఫలితాలు అమాయక పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు ఫలితాలు అనుభవిస్తున్నారు.

Latest Articles

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్