కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఢిల్లీలోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. తుగ్లక్ లేన్‌లో గల 12వ నెంబర్ బంగ్లాలో ఉంటున్న రాహుల్ తన వస్తువులను ఓ ట్రక్ లో తరలించారు. పరువునష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చడంతో ఆయన తన పార్లమెంటు సభ్యత్వం కోల్పోయారు. దీంతో లోక్ సభ సచివాలయం ఈనెల 22లోపు అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఇవాళ ఆ ఇంటిని ఖఆళీ చేశారు. ప్రస్తుతం తన తల్లి సోనియా గాంధీ(Sonia Gandhi) ఉంటున్న జన్‌పథ్ నివాసానికి మారుతున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాగా 2004లో లోక్ సభకు ఎన్నికైన రాహుల్ అప్పటి నుంచి ఈ నివాసంలోనే ఉంటున్నారు. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తుది తీర్పును వెల్లడిస్తామని ప్రకటించింది.