స్వతంత్ర వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో భారీ విజయం తరువాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది. దీని కోసం ముందు పార్టీలో నాయకులందరని ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. పార్టీలోనే వర్గ పోర్టులు చాలానే నడుస్తున్నాయి. వీటికి ముగింపు పలికేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఏర్పడిన వర్గ పోరుకు ముగింపు పలికేందుకు ఆ పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే దిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమవేశమయ్యారు. చాలా నెలల తర్వాత హైకమాండ్ సమక్షంలో అశోక్ గహ్లోత్- సచిన్ పైలట్ ముఖాముఖి సమావేశం ఇదే కావడం గమనార్హం.
ఈ భేటీ సుమారు నాలుగు గంటల పటు జరిగింది. .”వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. రాజస్థాన్ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటాం. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ ఇద్దరూ ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. మాది బీజేపీపై ఉమ్మడి పోరు. రాజస్థాన్లో మళ్లీ అధికారం మాదే” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఇంకా భేటీకి ముందే మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. కాంగ్రెస్ హైకమాండ్ చాలా బలంగా ఉంది. ఏ నాయకుడికీ, కార్యకర్తకూ పదవులు డిమాండ్ చేసే ధైర్యం లేదని.. కాంగ్రెస్‌లో ఏ నాయకుడైనా ఏదైనా డిమాండ్ చేస్తే.. పార్టీ హైకమాండ్ ఆ పదవిని ఇచ్చే సంప్రదాయం లేదు. అలాంటి ఫార్ములా గురించి మేము ఎప్పుడూ వినలేదు. కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు ఇలాంటివి జరగలేదు. భవిష్యత్తులో కూడా జరగవని అశోక్ వ్యాఖ్యానించారు.