కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని విమర్శించారు. లండన్(London)లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ’21వ శతాబ్ధంలో లెర్నింగ్ టు లిజన్’ అనే అంశంపై ఆయన ప్రసగించారు. తనతో పాటు పలువురి రాజకీయ నాయకులపై పెగాసస్ స్పైవేర్ ఉపయోగించారని ఆరోపణలు చేశారు. సమస్యలపై పార్లమెంట్ ముందు నిలబడి ప్రశ్నించినందుకు తనను అరెస్ట్ చేశారని తెలిపారు.
అలాగే తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) రోజులను గుర్తుచేసుకున్నారు. జమ్ముకశ్మీర్(Jammu Kashmir) లో జోడో యాత్ర చేపట్టినప్పుడు తన దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడని.. ప్రజల కష్టాలు వినేందుకు నిజంగానే ఇక్కడికి వచ్చారా అని ప్రశ్నించాడన్నారు. అనంతరం దూరంగా ఉన్న కొందరి వ్యక్తులను చూపించి వారంతా ఉగ్రవాదులని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో తనను ఉగ్రవాదులు చంపేస్తారేమో అనుకున్నానని.. కానీ వారు అలా చేయలేదన్నారు. ఎందుకంటే లిజనింగ్ కు ఉన్న శక్తి అదే అని రాహుల్ వెల్లడించారు.