26.4 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

నా దగ్గర కేటీఎం 390 బైక్‌ ఉంది.. : రాహుల్ గాంధీ

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత నెలలో ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో బైక్‌ మెకానిక్‌ షాపులను సందర్శించి అక్కడి మెకానిక్‌లతో ముచ్చటించిన విషయం తెలిసిందే. వారితో కలిసి కొన్ని బైక్‌లను సైతం అయన రిపేర్ చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ యూట్యూబ్ చానల్‌లో విడుదల చేశారు. మెకానిక్‌లతో మాట్లాడుతున్న సందర్భంగా తన వద్ద ఉన్న బైక్‌ గురించీ రాహుల్‌ ప్రస్తావించారు. దాన్ని ఎందుకు బయటకు తీయరో కూడా వివరించారు. ‘‘నా దగ్గర కేటీఎం 390 బైక్‌ ఉంది. కానీ దాన్ని నేను వినియోగించను. దాన్ని నడిపేందుకు నా భద్రతా సిబ్బంది అనుమతించరు” అని అన్నారు. మెకానిక్‌ల సమస్యలను తెలుసుకునేందుకు తాను అక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఈ సమయంలో ‘మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది?’ అని మెకానిక్‌లు అడిగ్గా.. రాహుల్‌ స్పందించలేదు.

‘భారత్‌ జోడో యాత్ర’తో దేశవ్యాప్తంగా రాహుల్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అది పూర్తయిన తర్వాత వివిధ వర్గాల వారి సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ట్రక్కుల్లో ప్రయాణం, మెకానిక్‌ షెడ్‌లో ముచ్చట్లు వంటివి చేపడుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుని, అందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్