ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావును పోలీసులు కోర్టులో హాజరుపరచ నున్నారు. రాధాకిషన్ రావును కస్టడీకి కోరే అవకాశం ఉంది.SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తర్వాత కీలకంగా భావిస్తున్న మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావును నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఉదయం రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్ బంజా రాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారిం చారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. 10 గంటలపాటు విచారించి రాధాకిషన్‌రావును అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇవాళ ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.