తెలంగాణ: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర నిర్వహించారు ఆలయ అధికారులు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకమునకు అవసరమైన దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న పుణ్య జలాలను భద్రాచలం అర్చక వైదిక కమిటీ సేకరించారు. 9 మంది అర్చక, వైదిక సిబ్బంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 12 పుణ్య నదీ జలాలు, 12 పుష్కరిణిల జలాలు, సముద్ర జలాలు తీర్ధాన్ని సేకరించారు. పుష్కర నదీ జలాలకు ప్రత్యేక పూజలు చేసి, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ పూజలు చేసి ఆలయ అధికారులు వైదిక సిబ్బంది శోభాయాత్ర నిర్వహిస్తున్నారు.