ఐపీఎల్(IPL) 16వ సీజన్ లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) బోణీ కొట్టింది. మొహాలీ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్(KKR) తో జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గబ్బర్ సేన 20 ఓవర్లలో 5వికెట్లకు191 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో రాజపక్స 50, కెప్టెన్ ధావన్ 40 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నైట్ రైడర్స్ ఆది నుంచే వికెట్లు కోల్పోతూ తడబడింది. వెంకటేశ్ అయ్యర్(34), సారధి నితీశ్ రానా(24) కొద్దిసేపు నిలకడగా ఆడడంతో మ్యాచుపై ఆశలు నెలకొన్నాయి. కానీ రానా ఔటవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చివర్లో హార్డ్ హిట్టర్ రసెల్(35) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా అప్పటికే రన్ రేట్ పెరిగిపోయింది. 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో వర్షం పడింది. దీంతో డీఆర్ఎస్(DLS)పద్ధతిలో పంజాబ్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు.