తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానించడం లేదని.. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రోటో కాల్ పాటించడం లేదని.. ఇటీవలే మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అయితే తాజాగా మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. వేదికపై కొందరు ప్రోటోకాల్ కు సంబంధం లేని వ్యక్తులు కూర్చున్నారని.. బిజెపి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లను అవమానించే విధంగా వ్యవహరించారని కార్పొరేటర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ కావాలనే బీఆర్ఎస్, బీజెపి నాయకులకు పట్టించుకోవడం లేదని మండిపడుతూ.. కార్పొరేటర్ వినకుండా బయటకు వెళ్లిపోయారు. మంత్రి శ్రీధర్ బాబు సముదాయించిన కార్పొరేటర్ వినలేదు. ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా.. కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్ లా చేస్తున్నారని కార్పొరేటర్లు మండిపడ్డారు.


