25.7 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా దీక్షలు

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా జంతర్ మంతర్ వద్ద నేడు సామూహిక నిరాహారదీ క్షలకు ఆమ్ ఆద్మీపార్టీ పిలుపు నిచ్చింది. పంజాబ్ లోని ఖత్కర్ కలాన్ వద్ద సామూహిక నిరాహారదీక్షలు జరుగుతాయి. ఢిల్లీ ఎక్సైజ్ విధానానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద, పంజాబ్ ఖత్కర్ కలాన్ వద్ద భారీ సభ, సత్యాగ్రహం నిర్వహించాలని అమ్ పిలుపు నిచ్చింది. ఖత్కర్ కలాన్ షహీద్ భగత్ సింగ్ స్వగ్రామం కావడం విశేషం. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బేరర్లు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆప్ ఢిల్లీ రాష్ట్ర కన్వీనర్ కూడా అయిన గోపాల్ రాయ్ తెలిపారు. దీంతో పాటు ప్రార్థనలు, రఘుపతి రాఘవ రాజారామ్ భజన కూడా చేస్తారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్