మెరీనో ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమ నుండి వచ్చిన వ్యర్థ జలాల వల్ల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు అగ్రి విట్రోటెక్ లాబరేటరీస్ పరిశ్రమ యజమాని హరిదాసు. సుమారు 25లక్షల అరటి మొక్కలకు నష్టం వాటిల్లిందని వాపోయారు. మేడ్చల్ మండలం రాజబొల్లారం పంచాయితీ పరిధిలోని ఈ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా అరటి మొక్కలను హరిదాసు పెంచుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తమకు జరిగిన నష్టంపై గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కాలుష్య నియంత్రణ శాఖాధికారులు మెరీనో పరిశ్రమలో తని ఖీలు నిర్వహించి శాంపిళ్లను సేకరిం చారన్న ఆయన వాస్తవ రూపంలో నివేదిక ఉండాలని కోరారు. వ్యవసాయ శాఖా ధికారుల నిర్లక్ష్యం కూడా తమ పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు హరిదాసు.