స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు గతంలో ఏం చేశాడో చెప్పుకోడానికి కూడా ఏమీ లేదని ఫైర్ అయ్యారు. ఇది చేశాం అని మేం చెప్పుకోగలుగుతున్నాం.. మరి చంద్రబాబు ఏం చెబుతారు? అంటూ ప్రశ్నించారు. అబద్దాల్లో చంద్రబాబుకు గిన్నీస్ రికార్డు ఇవ్వొచ్చుని సజ్జల వ్యంగ్యంగా మాట్లాడారు. మహానాడులో చంద్రబాబు విడుదల చేసిన మినీఫెస్టోలోని హామీలు దరిద్రంగా ఉన్నాయని అన్నారు. మేం అమలు చేస్తున్న హామీలను కూడా కాపీ కొట్టి పెట్టారని వ్యాఖ్యానించారు. అరాచకం, అవినీతిలో చంద్రబాబు కొత్త రికార్డు క్రియేట్ చేశారని సజ్జల అభిప్రాయపడ్డారు.