ఒక్క పోలవరమే కాదు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పనులు ఐదేళ్లుగా నిలిచిపోవడంతో వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గత ఐదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టు పెండింగ్ పనులకు నిధులు కేటాయించకపోవటం కనీసం మెయింటెన్స్ నిధులు కూడా ఇవ్వకపోవడంతో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు నిర్మాణాలు దెబ్బతినే పరిస్థితులకు దారితీశాయి. సీమ జిల్లా ప్రయోజనాల కోసం చేపట్టిన గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గోరుకల్లు వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భారీ రిజర్వాయర్ పూర్తి చేయకపోవడంతో వెంటాడుతున్న సమస్యలపై స్వతంత్ర ప్రత్యేక కథనం.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో 4లక్షల 79వేల 750 ఎకరాల ఆయకట్టు భూములకు సాగు నీరుతోపాటు 10 లక్షల మందికి తాగునీటిని అందించాలన్నది ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు వద్ద 12.4 టీఎంసీల సామర్థ్యంతో ఓ భారీ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. 480.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణానికి 2005లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో నిధులు మంజూరు చేశారు. గోరుకల్లు గ్రామ సమీపంలో 12.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టనున్న రిజర్వాయర్ నిర్మాణపు పనులను 2005లో ఓ నిర్మాణ సంస్టకు అప్పగించారు. 448.20 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంపై 14.33 శాతం తక్కువ మొత్తానికే పనులు చేపడతానని గుత్తేదారు ముందుకు వచ్చారు. 2005లో పనులు ప్రారంభించి 2008లోపు పూర్తి చేయాలి. 16 సంవత్సరాలు గడచినా నేటికి పనులు పూర్తిచేయలేకపో యారు. పైనల్ స్టేజిలో చేపట్టాల్సిన పనులు చేపట్టకపోవటం తో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక వైపు మరమత్తుల పనులు చేపడుతున్నా కూడా రిజర్వా యర్ వద్ద పనులు పూర్తికావటానికి 100 కోట్ల రూపాయల అవసరమవుతాయి. ఈ నిధులు కొసం గత ఐదేళ్లలో ఎన్నో ప్రతిపాదనలు పంపిన కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు.
రిజర్వాయర్ నిర్మాణం గడువులోగా పూర్తికాకపోవడంతో పెండింగ్ పనులతో పలు సమస్యలు తలెత్తు న్నాయి. 2016లో మెదటిసారిగా రిజర్వాయర్ లో 1.78 టీఎంసీల నీటని నిల్వ చేశారు. కొద్దిపాటి నీటి నిల్వకే రిజర్వాయర్ కింది భాగంలో నీటి ఉటలతో భూమిలోనుంచి నీరు బయటికి రావడంతో గ్రామ స్తులు భయాందోళనకు గురయ్యారు. రిజర్వాయర్ కింది భాగంలో లీకేజీలను ఇంజనీర్లు పరిశీలించి, రిజర్వాయర్ ముందు భాగంలో 40 కోట్లతో లోడెడ్ బండ్ నిర్మాణాన్ని చేపట్టారు. 40 కోట్ల వెచ్చించినా లీకేజిలు మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. రిజర్వాయర్ కింది భాగంలో లీకేజీ అవుతన్న నీటిని ఒక క్రమ పద్దతిలో కాల్వల ద్వార బయటకు వదిలారు.
రిజర్వాయర్ కింది భాగంలో లీకేజీలను కంట్రోల్ చేశామని చెప్పకొంటున్న సమయంలో తాజాగా రిజర్వా యర్ లోపలి భాగంలో రాతి పరుపు కట్టడం కుంగిపోయింది. రిజర్వాయర్ మట్టి కట్టపై వర్షపు నీరు రిజర్వాయర్ లోపలి భాగంలోకి వెళ్లడంతో రిజర్వాయర్ లోపలి భాగంలో నిర్మించిన రాతిపరుపు కట్టడం కుంగిపోయింది. మరమత్తులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని చెప్పినప్పటికీ మరో ప్రవేట్ సంస్టతో కుంగిన రాతికట్టడం మరమత్తుల పనులు చేయించారు. ఈ పనులు చేసి నెలలు గడవకముం దే రిజర్వాయర్ లోపలి భాగంలో మరో వైపు రాతికట్టడం పనులు కుంగిపోయాయి. ప్రస్తుతం కుంగిపోయి న రాతికట్టడం పనులు చేపడుతున్నారు. రిజర్వాయర్ వద్ద పూర్తికావాల్సిన పనులను గత ఐదేళ్లుగా చేప ట్టకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.