ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నీల మామిడాల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “ప్రవీణ్ ఐపిఎస్”, షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మాజీ ఐపిఎస్ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్‌గా ప్రవీణ్ ఐపీఎస్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల విడుదల చేశారు.
ఈ నెల 27న ప్రవీణ్ ఐపీఎస్ సినిమా టీజర్‌ను విడుదల చెయ్యబోతోంది చిత్ర యూనిట్. నవంబర్‌లో సినిమాను రిలీజ్ చెయ్యడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు:
నంద కిషోర్, రోజా, దుర్గా దేవ్ నాయుడు, వన్య అగర్వాల్, సతీష్ సరిపల్లి, జ్యోతి తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్
నిర్మాత: నీలా మామిడాల
డైరెక్టర్: దుర్గా దేవ్ నాయుడు
మ్యూజిక్: ఎన్. ఎస్. ప్రసు
కెమెరామెన్: నాగ్ సోధనపల్లి
ఎడిటర్: ఆర్.ఎం. విశ్వనాధ్ కుచనపల్లి
లిరిక్స్: కిరణ్ ఓలేటి, రామ దుర్గం