నటుడు ప్రకాష్‌రాజ్‌పై నిర్మాత నట్టికుమార్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా పవన్ వర్సెస్ ప్రకాష్‌రాజ్ మధ్య సనాతన ధర్మంపై వార్ నడుస్తున్న నేపథ్యంలో.. నట్టికుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రకాష్‌రాజ్ స్వార్ధపరుడని.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని మండిపడ్డారు. గతంలో ఎన్నో సందర్భాలలో ఎన్నో ఘటనలలో స్పందించని ప్రకాశ్‌రాజ్.. ఇప్పుడు అనవసరంగా పవన్ కళ్యాణ్‌తో ట్వీట్ల యుద్ధం చేస్తుండటం వెనుక స్వార్ధపూరిత ఎత్తుగడ కనిపిస్తోందన్నారు. ఏ రోజు అయినా చిత్ర పరిశ్రమ కోసం, ప్రజల కోసం ప్రకాష్ రాజ్ ఏమైనా చేశాడా అని ప్రశ్రించారు. కర్ణాటకకు చెందిన ప్రజ్వల్ రేవన్న అమానవీయ ఘటనల పై ప్రకాష్ రాజ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రజనీకాంత్ విషయంలో ట్రోల్ల్స్ చేసినపుడు స్పందించని ప్రకాష్ రాజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ.. ట్వీట్లపై ట్వీట్లు పెడుతూ స్పందించడంలో రాజకీయ కుట్రకోణం దాగి ఉందన్నారు. పవన్ కల్యాణ్ పేరు చెప్పి ప్రకాష్ రాజ్ దేవుడిని అవమానిస్తున్నాడని మండిపడ్డారు.